Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొజాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి.విజయలక్ష్మి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 5, 6, 7వ తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాలరాజ్ వెల్లడించారు. గురువారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాల సన్నాహక కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలకు.25 రాష్ట్రాల నుంచి దాదాపు 350 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. 5న ఉదయం 10లకు ఏఐటీయూసీ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమౌతాయని, 6న ఉదయం 11గంటలకు ఆన్లైన్ బహిరంగసభ జరుగుతుందని, అనంతరం విస్తృతంగా చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాల్లో ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షులు రామేంద్రకుమార్, ప్రధానకార్యదర్శి అమర్ జీత్ కౌర్, వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్.మహదేవన్, సిహెచ్. వెంకటాచలం, రాజన్నాగర్, (బ్యాంక్ రంగం), రాజ్యసభ సభ్యులు బినోరు విశ్వం, మోహన్ వర్మ (విద్యుత్ రంగం), లఖన్ మెహతా (కోల్ రంగం) తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక తిరోగమన విధానాలు, 4 లేబర్ కోడ్లు, ప్రభుత్వరంగ సంస్థల రక్షణ, మోడీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసక విధానాలు, ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, సంపన్న వర్గాలకు ప్రభుత్వరంగ సంస్థల దారాదత్తం, బీమా, బ్యాంకులు, రైల్వేలు, రక్షణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి, సింగరేణి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వారు వెల్లడించారు. జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు పురస్కరించుకుని నగరంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశాలు జరుగుతున్న కాచిగూడలోని పలు ప్రాంతాల్లో ఏఐటీయూసీ జెండాలు, అరుణ పతాకాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ యూసుఫ్, ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, ఉపాధ్యక్షులు బి.చంద్రయ్య, కార్యదర్శులు యం.నర్సింహ్మా, బి.వెంకటేశం, కోశాధికారి పి.ప్రేంపావని, రాష్ట్ర నాయకులు ప్రవీణ్ కుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.