Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొభీం ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని భీం ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బానిస సంకెళ్ల నుంచి బంధ విముక్తి చేయడమే లక్ష్యంగా రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న అంబేద్కర్ను కించపరిచేలా, రాజ్యాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అపహాస్యం చేస్తున్నాయన్నారు. రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడడమే ఇందుకు నిదర్శనం అన్నారు. అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్న అధికార పార్టీ దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు ముఖ్యమంత్రిని నిలదీయట్లేదన్నారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్న మాటలు నీటిమూటలేనా అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాజ్యాంగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా భీం ఆర్మీ పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలీ ఆయాస్, నాయకులు సూరారపు పరీక్షణ్, చలపతి, రమేష్ మోడీ,హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.