Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవాసరం బిల్ కలెక్టర్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మున్సిపల్ కమిషనర్ వసంత పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో చాలా కాలంగా ఇంటి పన్నులు కట్టకుండా ఉన్న వారిని గుర్తించి వారితో పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ ప్రజలు ఇంటి, కమర్షియల్, నీటి పన్నులు పెండింగ్ ఉండకుండా వెంటనే కట్టేసి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఏడాది కాలంగా మొండి బకాయిలు చెలించాలని కోరుతున్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో వారిపై చట్ట రీత్యా చర్యలు మున్సిపాలిటీ అధికారులు తీసుకుంటార న్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అంజిరెడ్డి, బిల్ కలెక్టర్లు మహేందర్, శివ, కృష్ణ మల్లేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.