Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
క్యాన్సర్‌పై పోరాటాన్ని వేగవంతం చేయడానికి, అవగాహన పెంపొందించడానికి, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించడం కోసం మెడికవర్ హాస్పిటల్స్ వారు క్యాన్సర్ పేషెంట్స్‌కి యోగా థెరపీ కార్యక్రమం నిర్వహించారు. క్లోజ్ ది రేర్ గ్యాప్ అనే సందేశంతో ఈ యోగా థెరపీని ప్రాంభించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా పాల్గొన్నారు. ప్రతి కుటుంబంలో క్యాన్సర్‌తో ఒకరిని కోల్పోవడం బాధ కలుగుతుందనీ, క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడంతో ప్రాణాలను దక్కించుకోవచ్చ న్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ మాట్లాడుతూ క్యాన్సర్ వల్ల మన దేశంలో 8.5 లక్షల మంది చనిపోతున్నారనీ, ఈ పరిస్థితి తరచుగా అజ్ఞానం, అపోహల నుంచి బయటకు వచ్చే భయాన్ని సృష్టిస్తుందన్నారు. జీవనశైలిని సవరించడం లేదా కీలక ప్రమాద కారకాలను పరిహరించడం ద్వారా 30శాతం క్యాన్సర్ కేసులను నిరోధించవచ్చన్నారు. ఈ యోగా థెరపీ ముఖ్య ఉద్దేశం చాలా మంది కాన్సర్ పేషెంట్స్ ఈ యోగా వల్ల జీవనశైలిలో మార్పు, వాళ్లకి ఆరోగ్య పరంగా ఎంతో దోహదపడుతుందన్నారు. డాక్టర్ సాద్విక్ రఘురాం, మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ మాట్లాడుతూ క్యాన్సర్ ప్రమాదా లను ప్రజలు అర్థం చేసుకోవడానికి, సకాలంలో స్క్రీనింగ్ ద్వారా సంక్లిష్టతలను పరిహరించడం కోసం మరింత అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. సకాలంలో స్క్రీనింగ్ చేయడం వల్ల క్యాన్సర్ ప్రారంభం కావడానికి ముందు కూడా నిరోధించవచ్చన్నారు. డాక్టర్ వినోద్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ ముఖ్యంగా యూత్ దూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. మంచి ఫుడ్ తీసుకుని క్యాన్సర్‌ను తరిమేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇతర వైద్య సిబ్బంది, సెంటర్ హెడ్ స్వప్నిల్ రారు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.