Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఎమ్మార్పీఎస్ జిల్లా మాలమహానాడు, అనుబంధ సంఘాలు బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమా నిస్తూ సీఎం కేసీఆర్ సవరణలు చేస్తాను అనడం సిగ్గు చేటు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సీఎం అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి పాదాలకు దండం పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఇటుక కిషన్, మాల మహానాడు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గుండ మల్ల నరసింహ, బ్యాగరి నరసింహ, బోయిన్పల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్, బోయిన్పల్లి మార్కెట్ అధ్యక్షులు అశోక్, చిన్న, విష్ణు, ప్రకాష్, సాయి, రాజు, హరీష్ కుమార్, తేజ, ఆకాష్ పాల్గొన్నారు.