Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
సౌత్ సెంట్రల్ రైల్వే కార్యాలయంలో డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం), హైదరాబాద్ మోతిలాల్ భూక్యని వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కలిశారు. ఈ సందర్భంగా వినాయక్‌నగర్ డివిజన్లోని చంద్రగిరి కాలనీ, వాజ్పేయినగర్, సీఎం రోడ్, దీన్‌దయల్ నగర్‌ను ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర డ్రయినేజీ, నూతన రోడ్డు పనులు చేసుకోవడా నికి ఎన్ఓసీ కోసం మల్కాజిగిరి జీహెచ్ఎంసీ ఈఈ లక్ష్మణ్ రాసిన లెటర్‌కు సమాధానం రానందున అక్కడి పనులు ఆగడంతో త్వరలో అనుమతులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన హైదరాబాద్ డీఆర్ఎం రైల్వేశాఖ నుంచి సర్వేకు ఇంజినీ రును పంపిస్తామనీ, బల్దియా అధికారులతో సమన్వ యం చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆర్.మణిరత్నం, ఉపా ధ్యక్షులు సాయి సురేష్ పాల్గొన్నారు.