Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన పెంపొం దించుకోవాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్స వం సందర్భంగా రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామినేని హాస్పిటల్స్ సహకారంతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయంతి క్యాన్సర్ రావడానికి గల కారణాలు గురిం చి, క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకు ఇచ్చే చికిత్స గురించి, క్యాన్సర్ రాకుండా ఉండటానికి పాటించా ల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించడానికి సహకరించి న కామినేని హాస్పిటల్ డాక్టర్ జయంతికి కృతజ్ఞతలు తెలిపారు.