Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
స్పాట్ అడ్మిషన్ కాకుండా కౌన్సెలింగ్ ద్వారా అన్ని కన్వీనర్ సీట్లను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రిజిస్ట్రార్ ప్రొ. లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. కొన్ని కాలేజీల్లో మిగిలి ఉన్న కన్వీనర్ సీట్లకు స్పాట్ అడ్మిషన్ ద్వారా మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారని, తమిళనాడులోని అన్ని కన్వీనర్ సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలి లేకపోతే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పొందలేరని, దీని ద్వారా విద్యార్థులకు నష్టం కలుగుతుందని ఓయూ కార్యదర్శి రవి నాయక్ అన్నారు. నీట్, జేఈఈ లాంటి జాతీయ ఎంట్రన్స్ పరీక్షలు నాలుగు సార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఓయూ కార్యదర్శి రవి నాయక్, రాష్ట్ర నాయకులు అరవింద్, ఓయూ ఉపాధ్యక్షులు విజయ నాయక్, రామాటేంకి శ్రీను, సతీష్, సందీప్, భరత్, ఉపేందర్, అఖిల్, సాయి పాల్గొన్నారు.