Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
రాజ్యాంగాన్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని తెలంగాణ గౌడ కల్లుగీత వత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్ తీవ్రంగా ఖండించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్ నేటికీ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పినందు యావత్ జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముప్పై మూడు జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు ఏ ఒక్కరికీ గౌడ్ లకు కేటాయించకపోవడం దారుణం అన్నారు. టీఆర్ఎస్ పాలనలో గౌడ జాతి నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.