Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగింది. లాలాపేట్‌లో ఆల్ ఇండియా డిజిటల్ మెంబర్ షిప్ కో ఆర్డినేటర్ దీపక్ జాన్ మెంబర్ షిప్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదును ప్రారంభిచారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. సభ్యత్వంతో పాటు రెండు లక్షల ప్రమాద బీమా కూడా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగంచేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏ బ్లాక్ ప్రెసిడెంట్ నేతికార్ సురేష్ లాల్, డివిజన్ ప్రెసిడెంట్ మని కుమార్, ప్రధాకార్యదర్శి రవి, బ్రహ్మాజీ, టీపీసీసీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, గణేష్ యాదవ్, హరినాథ్, కిషోర్ యాదవ్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.