Authorization
Sun March 23, 2025 05:08:11 am
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్‌ను అవమానపరిచే విధంగా ఉన్నాయని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని హిమాయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మీ రామన్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం డివిజన్లోని రాజామొహల్లా బస్తీలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మౌన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జి.రామన్ గౌడ్, రఘురామరెడ్డి, పి.ప్రసాద్, నర్సింగ్ ముదిరాజ్, శేఖర్, మల్లేష్, నర్సింగ్ గౌడ్, నవీన్, సతీష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.