Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ప్రజల సౌకర్యార్థం నల్ల చెరువు పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామని కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని నల్ల చెరువు పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మేనేజర్ అనిల్ కుమార్, ఇంజినీరింగ్ విభాగం ఏఈ శివప్రకాష్, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నాగరాజు, వెంకటేష్, రాజు, ప్రవీణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.