Authorization
Fri March 21, 2025 08:04:49 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మ కాలనీలోని కమిటీ హాల్ రోడ్, రామాలయం గుడి రోడ్ల సమస్యలపై బస్తీవాసులు, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దష్టికి తీసుకువచ్చారు. దీంతో కార్పొరేటర్ శివమ్మ కాలనీలో పాదయాత్ర చేసి రోడ్ల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలోని ప్రతీ కాలనీ అభివద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, అలాగే శివమ్మ కాలనీలో కూడా రోడ్డు నిర్మాణ పనులు వీలైనంత త్వరలో ప్రారంభించి, పూర్తి చేస్తామని బస్తీ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకష్ణ గౌడ్, శివరాజ్ గౌడ్, వాసుదేవ్ రావు, నరసింహులు, సిద్దయ్య, మల్లేష్, చిన్న మున్నా, కటికరవి, రవీందర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.