Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ శుక్రవారం పీ అండ్ టీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీటి, పవర్ బోరు ఏర్పాటు, శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలను అమర్చాలని, రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని పక్కకు జరపాలని తదితర సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆమె ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి ఏఈ అసిప్ ఆలీ, బీజేపీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ బొమ్మగోని కైలాష్, పతిగౌడ్, సంజరు పటేల్, బీజేపీ రాష్ట్ర గీతా సెల్ కన్వీనర్ బొమ్మగోని రఘపతి గౌడ్, డివిజన్ ఉపాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్, కట్ట భాస్కర్ రావు, కిష్టాపురం శ్రీనివాసచారి, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షుడు అల్కాపురి సురేష్, యూసుఫ్, కలీద్ పాల్గొన్నారు.