Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కేంద్ర బడ్జెట్ అంతా అంకెల గారడీ అని, భారత రాజ్యాంగాన్ని అడుగడుగున ఉల్లంఘిస్తున్న కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రను తిప్పికొట్టాలని బహుజన్ ముక్తి పార్టీ ( బీఎంపీ) రాష్ట్ర అధ్యక్షుడు అంసొల్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాచకొండ వెంకన్న, ఉపాధ్యక్షుడు డా.నరేందర్ పవార్ అన్నారు. శుక్రవారం హబ్సిగూడలోని బీఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలు చేయడాన్ని బీఎంపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. డా.అంబేద్కర్, భారతజాతి సమస్త ప్రజానీకానికి బహిర్గతంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఎంపీ నాయకులు మైసయ్య, ఐలయ్య పాల్గొన్నారు.