Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
'వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ ఎంఎన్జేలో రూ.7.16 కోట్లతో అధునాతన సిటీస్కాన్ ఏర్పాటు చేశాం. రోటరీ క్లబ్ రూ.కోటితో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ని ప్రారంభించాం. సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్లను స్క్రీన్ చేసేందుకు ఈ బస్ ఉపయోగపడుతుంది..' అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా లక్డీకాపూల్‌లోని ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్, సిటీ స్కాన్, 100 పడకల సత్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నినారావు చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ.3 కోట్లతో పేషెంట్స్ అటెండెన్స్ కోసం 300 పడకలతో ఏర్పా టు చేసిన భవనం నేటి నుంచి అందుబాటులోకి వస్తుంద న్నారు. డెంటల్ ఎక్స్‌రే కోసం ఓపీజీ మెషిన్ని ప్రారంభించామని, ఉద్యో గుల కోసం 23 స్పెషల్ రూమ్స్ బ్లాక్‌ని రూ.3 కోట్లతో ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంఎన్‌జేకు బడ్జెట్‌ను డబుల్ చేశామన్నారు. 200కు పైగా పోస్టులను మంజూ రు చేసినట్టు తెలిపారు. అరబిందో ఫార్మా ఆధ్వర్యంలో రూ.65 కోట్లతో 300 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నారన్నారు. ఏప్రిల్ నెలా ఖరు నాటికి కొత్త బ్లాక్ అందుబాటులోకి తీసుకొస్తామనీ, పక్కనే ఉన్న మూడెకరాల స్థలాన్ని ఎంఎన్‌జేకు త్వరలోనే కేటాయిస్తామన్నారు.
30 ఏండ్లలో 50 శాతం క్యాన్సర్ కేసులు పెరిగాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 100 రకాల క్యాన్సర్లను గుర్తించారని తెలిపారు. ఆహారంలో మార్పుల ద్వారా, బరువుని అదుపులో ఉంచుకుంటే కొంత వరకు క్యాన్సర్‌ను నియంత్రించొచ్చన్నారు. పీహెచ్సీ స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బీపీ, షుగర్ వ్యాధుల్లాగే క్యాన్సర్‌ని కూడా స్క్రీనింగ్ చేసేందుకు సర్కారు నిర్ణయం తీసుకుందన్నారు. సిబ్బందికి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నామన్నారు. గ్రామ స్థాయిలో 40 ఏండ్లు దాటిన వారందరికీ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 22శాతం నోటి, 13 శాతం బ్రెస్ట్, 12 శాతం గర్భాశయ క్యాన్సర్లు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఎంఎన్జేలో మూడు ఆపరేషన్ థియేటర్లు మాత్రమే ఉన్నాయని, రూ.15 కోట్లతో త్వరలో 8 మాడ్యులార్ థియేటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇందులో ఒకటి రోబోటిక్ థియేటర్ అన్నారు. మార్చి నెలాఖరుకు కొత్త ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. నిమ్స్, ఎంఎన్‌జే ఆస్పత్రుల్లోనూ క్యాన్సర్ రోగులకు చికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ కోసం వైద్యులు 3డీ టెక్నాలజీతో చేస్తున్నారని వెల్లడించారు. కిమో, రేడియో థెరపీలను జిల్లా ఆస్పత్రుల్లోనూ అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ చేయనున్నామని, త్వరలో ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించనున్నామని చెప్పారు. అంతకు ముందు మంత్రి హరీశ్‌రావు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పపత్రిలో ప్రతి వార్డునూ పరిశీలించారు. రోగులతో మాట్లాడారు.
క్యాన్సర్ బారిన పడిన చిన్నారులతో..
క్యాన్సర్ బారిన పడివ చిన్నారులతో కొద్దిసేపు మంత్రి హరీశ్‌రావు ముచ్చటించారు. ఆ వార్డులోని పిల్లలకు గిఫ్ట్‌లు అందజేశారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. చిన్నారులు వేసిన చిత్రాలను పరిశీలించారు. వాటిపై సరదాగా ప్రశ్నలు వేసి చిన్నారులను ఉల్లాస పరిచారు.