Authorization
Fri March 21, 2025 04:33:19 pm
నవతెలంగాణ-హైదరాబాద్
సీఎం సహాయనిధి నిరుపేదలకు ఆపన్నహస్తం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ నందీహిల్స్కు చెందిన బాల్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం టీఆర్ఎస్ 9వ డివిజన్ నాయకులు రామిడి నర్సిరెడ్డి ద్వారా ఆర్థిక సాయం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ.40 వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ నందీహిల్స్ ఫేజ్ 1 ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.