Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
జల్ పల్లి మున్సిపల్లో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గ మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు ఖైసర్ బాం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా మున్సిపల్ కార్మికుల అనేక ఇబ్బందులు పడుతున్నారనీ, ప్రభుత్వం కార్మికులను ఆదుకోవటం కోసం ప్రవేశ పెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవటం కోసం గుర్తింపు కార్డులు ఎంతో అవసరం ఉందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజా సమస్యల పరిస్కారం చేయడానికి రూ.కోట్ల నిధులను మంజూరు చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించటానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.