Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓయూ ఇన్స్పెక్టర్ ఎల్. రమేశ్ నాయక్
నవతెలంగాణ-ఓయూ
పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఓయూ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్ అన్నారు. శనివారం లాలాపేట పరిధిలోని వినోభానగర్ కమ్యూనిటీహాల్లో మత్తుపదార్థాలవల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... తల్లిదండ్రులకు, పిల్లలకు మత్తు పదార్థాలవల్ల కలిగే అనర్థాలు, ప్రభుత్వం తీసుకువచ్చిన డ్రగ్స్ నిషేధం అంశాలపై అవగాహన కల్పించారు. యువత మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తుపదార్థాలు అమ్మినా, సేవించినా వారిపై కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. బస్తీలో, కాలనీలో పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు.