Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేయర్ పారిజాత నర్సింహ్మారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రికి చెందిన వారు ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరా లను ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొ రేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సిహ్మారెడ్డి అన్నారు. శనివారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని 30వ డివిజన్ సుబ్రహ్మణ్యం కాలనీలో ఇమా న్యుయల్ పార్థన మందిరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ భీమిది స్వప్న జంగారెడ్డితో కలసి మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ప్రభుత్వం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఇమానుయల్, స్థానిక చర్చి ఫాదర్, క్రిస్టియన్ మైనార్టీసెల్ మున్సిపాల్ కార్పొరేషన్ అశోక్, ఉపాధ్యక్షులు డేనియల్, పాస్టర్ మనోహర్, మోసెస్, సిబ్బంది, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.