Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
పాదయాత్రలో గుర్తించిన సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని అంబర్‌పేట ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్ అన్నారు. శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి కాచిగూడ డివిజన్లోని దశరథ్ గల్లీ (చెప్పల్ బజార్), బాలప్పబాడ (లింగంపల్లి) బస్తీల్లో ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ శిరీష యాదవ్‌తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర లో బాలప్పబాడ కాలనీలో ఉన్న దేవాలయంలో డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని, దేవాలయ అభివద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, బస్తీలో 2 చిన్న వాటర్ ట్యాంకులు పాడైపోయాయని, వాటి స్థానంలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్‌ను నిర్మించాలని, కాలనీ కమ్యూనిటీ హాల్లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని, బస్తీలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరారు. అనంతరం దశరథ్ గల్లీలో డ్రైనేజీ పైప్‌లైన్ ఎగుడుదిగిడుగా ఉండడంతో వేసవి కాలంలో మురుగు నీరు చేరి దుర్వాస నతో పక్కనే ఉన్న ప్రజలు ఇబ్బందిపడుతున్నారని పైపులైన్ మరమ్మతులు చేయాలని, ఐరన్ కరెంటు పోల్స్ స్థానంలో సిమెంట్ కరెంట్ పోల్స్ ఏర్పాటు చేయాలని, పలు ప్రాంతా లలో నూతన కరెంట్ పోల్స్ ఏర్పాటు చేసి రాత్రి సమయాల్లో చీకటితో ఇబ్బంది పడకుండా చూడాలని, బస్తీలోని డంపింగ్ యార్డులో అందరూ చెత్త వేస్తూ సరైన పరిశుభ్రత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, డంపింగ్ యార్డ్ తొలగించేలా చూడాలని, బదులుగా జీహెచ్ఎంసీ చెత్త బండ్లలో చెత్తను సేకరించే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ పాదయాత్రలో గుర్తించిన సమస్యలను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ త్వరగా పరిష్కరిం చాలని అన్నారు.
కార్యక్రమంలో ఈఈ శంకర్, ఏఈ ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ సంపత్, వాటర్ వర్క్స్ డీజీఎమ్ సన్యాసి రావు, ఏఈ భావన, బస్తీ వాసులు లక్ష్మీనారాయణ, రఘు, అనిల్‌గౌడ్, రాము, శంకర్‌రెడ్డి, శ్రీకాంత్, మహేష్, కష్ణ, టీఆర్ఎస్ పార్టీ కాచిగూడ డివిజన్ నాయకులు భీష్మ, సదానంద్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.