Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ డివిజన్ పరిధిలో గల సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో బ్లూ స్పారో కేఫ్ మరియు రెస్టారెంట్‌ను స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి వైపుగా అడుగులేస్తూ వ్యాపార రంగంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని వారు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు నారాయణసింగ్, మోతీలాల్ నాయక్, సీనియర్ నాయకులు తుమ్మలపల్లి యాదగిరిరెడ్డి, బీజేపి డివిజన్ జనరల్ సెక్రెటరీ ముడుపు సందీప్‌రెడ్డి, ఉపాధ్యక్షులు మెట్టుపల్లి సంతోష్‌రెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.