Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా అభివద్ధి చెందిన కార్పొరేషన్‌గా పేరొందిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నేడు కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ చర్యల కారణంగా అభివద్ధి కుంటుపడిపోయిందని టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ అన్నారు. శనివారంనాడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జిల్లాపరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28 డివిజన్లలో ఉన్న చెత్తను సేకరించిన తడి, పొడి చెత్తగా వేరు చేసేలా రూపొందించిన ఆటోలు సుమారు రూ.2కోట్ల రూపా యల నిధులను వెచ్చించి కొనుగోలు చేసిన చెత్త ఆటోలను మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి నెల రోజుల కావస్తున్నా స్వచ్ఛ కార్మికులకు పంపిణీ చేయకుండా ఇక్కడే ఉంచారని వాపోయారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ పోటీలు ప్రారంభమ య్యాయని ఈ పోటీలలో దేశంలోని కార్పొరేషన్లు ముందు వరుసలో నిలిచేందుకు విశేషంగా కషిచేస్తున్నాయని కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం కమిషనర్ అలసత్వం కారణంగా చెత్త సేకరణ పనులు ముందుకు సాగాడంలేదని వాపోయారు. గతంలో కార్పొరేషన్ ఏర్పాటైన తొలి రోజుల్లో బోడుప్పల్ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో దేశంలోనే ముందు భాగంలో నిలిచిందని పేర్కొన్నారు. మరి అలాంటి బోడుప్పల్ నేడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పేరుప్రఖ్యాతులు దెబ్బతింటున్నాయని విమర్శించారు. కమిషనర్‌కు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకుంటే వెళ్ళిపోవాలని, కానీ ఇక్కడ ఉండి పనిచేయ కుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా కమిషనర్ తీరు మార్చుకోవాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బద్దుల సత్యనారాయణ యాదవ్, పోతుల మల్లేష్, వెంకట్ రెడ్డి, పడతం లోకేష్, కొండ రామ్ చందర్, వల్లపు ఐలేష్, సుడి కష్ణారెడ్డి, నాగేపల్లి మల్లేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.