Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
గ్రామ పంచాయతీ విధుల పని ఒత్తిడి, రాజకీయ నాయకుల వేధింపులు తగ్గించాలని మండల పరిషత్ అభివద్ధి అధికారిణి మమతాబాయి, మండలపరిషత్ అధికారిణి వినోదలకు పంచాయతీ కార్యదర్శులు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా గ్రామ పంచాయతీ విధులకు సంబంధించిన పని ఒత్తిడి ఎక్కువ కావడంతో మానసిక సమస్యలతోపాటు, అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు తెలిపారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం, నారాయణపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి బలన్మరణానికి పాల్పడ్డారన్నారు. ఈ విషయంపై యావత్ తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా ఉండాలంటే పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి, రాజకీయ నాయకుల వేధింపులు తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పలుమార్లు ఉన్నతాధికారుల దష్టికి తమ సమస్యలు తీసుకెళ్లడం జరిగిందని గుర్తుచేశారు. అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో టీపీఎస్ఏ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఈర్లపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు భాస్కర్, సంఘం సభ్యులు బబిత, అరుణ, రమేష్, శివప్రసాద్ తదితరులు ఉన్నారు.