Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
పేద ప్రజలకు అందుబాటులో వుండేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌కి దీటుగా పలు రకాల వైద్య సదుపాయాలను ఒక చోట సమీకరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిం చాలనే సంకల్పంతో సమిష్టి కషితో హస్తినాపురంలో నూతనంగా వెల్నెస్ హస్పిటల్స్ని ఏర్పాటుచేయడం జరిగిందని డైరెక్టర్లు అసద్‌ఖాన్, సుమన్‌గౌడ్, వివేక్‌లు అన్నారు. ప్రత్యేక అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వెల్నెస్ హాస్పిటల్‌ను స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మరియు కార్పొరేటర్ బానోత్ సుజాతనాయక్ నిర్వహకులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ హాస్పిటల్‌కి డెలివరీ కోసం వచ్చిన మహిళలకు ఆడబిడ్డ పుడితే ఎటువంటి చార్జీలు తీసుకోమని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించడం హర్షణీ యమని, జంటనగరాలలో ఎక్కడ కూడా ఎలాంటి ఆఫర్లు లేవని వారన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వైద్య సేవలందిస్తున్న వారి కషి అభినందనీయమన్నారు. నగరం లో ఎన్నో హాస్పిటల్స్ వైద్య సేవల పేరుతో ఎన్నో లాభాలను ఆర్జిస్తున్నారని, మానవతా దక్పథంతో యువ యజమా నులు పేద, మధ్యతరగతి ప్రజల కష్టం విలువ తెలిసిన వారిలా వైద్యరంగంలో ముందడుగు వేసి అంచెలంచెలుగా రాణించాలని ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. హాస్పిటల్లో చేరిన పేషెంట్‌తో పాటు వారి సహాయకులకు కూడా ఉచితంగా అల్పాహారాన్ని అందించనున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అందోజు సత్యంచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మే రెడ్డి ఉదరు కుమార్ రెడ్డి, బీజేపీి నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నారగోని శ్రీనివాస్‌యాదవ్, విజరు, వెంకట్, మహేష్‌లతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.