Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హయత్‌నగర్
హయత్‌నగర్ డివిజన్లోని పాత గ్రామంలో 13.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్ భూమి పూజలో ఎంఆర్డీసీఎల్ చైర్మెన్, స్థానిక శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డిలు, అదేవిధంగా మన్సురాబాద్ డివిజన్ పరిధిలో గల సరస్వతీనగర్ కాలనీలో 23లక్షల రూపా యల వ్యయంతో నిర్మించే కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, సామ తిరుమల రెడ్డిలు పాల్గొన్నారు. అలాగే కాలనీవాసులు తమ ప్రత్యేక నిధులతో నిర్మించుకున్న ఆర్చ్‌ను శాసనసభ్యులు ప్రారంభో త్సవం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్, మల్లారెడ్డి, జగదీష్ యాదవ్, విజరు భాస్కర్‌రెడ్డి, ఆనంద్, జగదీష్, భాస్కర్ యాదవ్, రాకేష్, మల్లేష్, శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల కమిటీ సభ్యులు, ఉద్యమకారులు, మహిళలు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.