Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రహదారి (పీర్జాదిగూడ నుండి పర్వతాపూర్) మోక్షం ఎప్పుడు లభిస్తుందని ఆ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పాలకవర్గాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారంనాడు పీర్జాదిగూడ కమాన్ నుంచి పర్వతాపూర్ గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ... పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపూర్ వరకు నాలుగు లేన్లతో రోడ్డు నిర్మిస్తున్నామని, దానిని మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ ప్రారంభించడానికి శిలాఫలకాలను ఎమ్మార్వో ఆఫీసు గోడకు పెట్టారని. ఈ రోడ్డుకు నిధులు మంజూరు కాలేదని తెలుసుకున్న మంత్రి దానిని ప్రారంభించకుండానే వెనుదిరిగిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆ విషయం తర్వాతనే పాలకవర్గం బండారం బయటపడిందని చెప్పారు. ప్రాధాన్యత లేని వాటికి కోట్ల రూపాయలు వెచ్చించడం సరికాదని చెప్పారు. పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపూర్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ చైర్మెన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు రంజిత్ రెడ్డి, ముదిగొండ రమేష్, రాళ్లబండ భాస్కర్, భద్రు శ్రీలత నాయక్, కె.మోహన్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.