Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సన్మానాల కన్నా పదిమందికి సహాయ పడే సత్కార్యం మిన్న అని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. సాధన సాహితీ స్రవంతి ప్రముఖ సాహితీ సంస్థ నిర్వహణలో ఆదివారం భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల సేవా కేంద్రం)లో డాక్టర్ రమణ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని 40 మంది ప్రమాదవశాత్తు అంగ వైకల్యం పొందిన వారికి కత్రిమ అవయవ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ రమణ మాట్లాడుతూ కత్రిమ అవయవాలు వైకల్యం కల వారికి అందించటం వారికి కొత్త జీవితాన్ని ఇచినట్లేనన్నారు. ప్రతి వ్యక్తి పరులకు సహాయ పడే రీతిలో ప్రవర్తించాలని ఇందుకు డబ్బే ముఖ్యం కాదని ఇతరేతరంగా కూడా సహాయపడవచ్చని అన్నారు. అధ్యక్షత వహించిన అశ్వని సంస్థల అధినేత అశ్వని సుబ్బారావు మాట్లాడుతూ ప్రార్ధించే పెడవులకన్న సహాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని అక్షరాల పాటిస్తున్న రమణ ఆదర్శనీయుడని అభినందించారు. సాధన నరసింహచార్య స్వాగతం పలికిన సభలో సి.హెచ్. హనుమంతరావు, జలవేంద్ర రావు, డాక్టర్ రంగారావు పాల్గొన్నారు.