Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రమాణస్వీకారోత్సవంలో అధ్యక్షులు కిషన్
నవతెలంగాణ-ధూల్‌పేట్
హరిజన సేవక మండలి అభివద్ధికి నిరంతరం కషి చేస్తానని ఆ సేవక మండలి నూతన అధ్యక్షులు మిద్దె కిషన్(కష్ణ) అన్నారు. చూడి బజార్‌లోని హరిజన సేవక మండలి ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మండలి అధ్యక్షులు కిషన్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ లకు ఎన్నికల కమిషన్ చైర్మెన్ అంజయ్య ఘనంగా కమిటీ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో 32 మాదిగ కాలనీలు, బస్తీలలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ పని చేస్తానన్నారు. ఎన్నికలో సహకరించిన సంఘం సభ్యులకు పోటీగా నిలిచిన టువంటి సంఘ సభ్యులకు అందరికీ కూడా కలిసి కట్టుగా పని చేస్తూ ముందుకు తీసుకెళ్లడంలో కషి చేస్తానన్నారు. కూలిపోవటంలో ఏమైనా మనమందరము ఒక్కటేనన్నారు. సమస్యల పరిష్కారంతో పాటు సంఘంలోని ప్రజలకు సమస్యల పరిష్కారానికి పని చేస్తానన్నారు. అనంతరం నూతన కమిటీ కార్యవర్గాన్ని ప్రమాణస్వీకారం చేయించారు. కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా వెంకటేష్, మ్యాతరి చంద్రమోహన్, సంయుక్త కార్యదర్శి రాజు, కిషోర్ర్ కోశాధికారి దేవేందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, 16 మంది కమిటీ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.