Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మైనార్టీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని రాళ్లకంచే హమీద్ బస్తీలోని మజీదే మెహ్రాజ్ కమిటీ నూతనంగా ఎన్నికైనా సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లీం గ్రేవ్ యార్డు అభివృద్ధికి ఇప్పటికే రూ.75 లక్షలు మంజూరయ్యాయని, వీటికి అదనంగా మరో రూ.50 లక్షలు మంజూరుకు కృషి చేయాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే గ్రేవ్ యార్డుకు త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మజీదే మెహ్రజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.