Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసకుంటుందని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరు కుమార్‌గౌడ్ అన్నారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు ఆదివారం అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్‌ను కలిసి డ్రగ్స్ నిర్మూలనపై చర్చించారు. ఈ సందర్భంగా విజరు కుమార్‌గౌడ్ మాట్లాడుతూ డ్రగ్స్‌తో యువత నిర్వీర్యమవుతుందని డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అన్నారు. డ్రగ్స్‌తో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడుతున్నాయని అన్నారు. డ్రగ్స్ నిర్మూలకు ఎక్సైజ్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని అందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు జయప్రకాష్, నాగమణి, మధుకర్, శిల్ప, జ్యోతి, మల్లేష్ పాల్గొన్నారు.