Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుజన సమాజ్ పార్టీ
నవతెలంగాణ-బాలానగర్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను రానున్న ఎన్నికల్లో గద్దె దించడం ఖాయమని కూకట్పల్లి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి జేరుపోతుల వెంకట్ స్వామి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజ్యాంగమనేది ఒక పవిత్ర గ్రంథమని, స్వాతంత్య్రం వచ్చేనాటికి పసిబిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు కల్పిస్తూ అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల 11 నెల 18 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి రచించిన ఘనత ఆయనదేనన్నారు. నాటి మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ కు అందించారని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఇందిరా గాంధీ మొదటి మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. మహనీయుడు రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించిన ముఖ్య మంత్రి కేసీఆర్ మర్చిపోయారని సిగ్గు చేటని అన్నారు. ఆయన బాధ్యత మరచి ఇష్టానుసారంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ఫలాలు దేశ బహుజనులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు అందకుండా అడ్డుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం మహిళా కన్వీనర్ చిలుక స్వరూప, అరుణ్ కుమార్, ఎం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.