Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
మహిళల ఉపాధి, నైఫుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ కార్పొరేటర్లు అమృత, ఉమా రమేష్‌యాదవ్ అన్నారు. స్కిల్ డెవెలప్మెంట్లో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సులు చేస్తున్న మహిళలను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం నరేంద్రమోడీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నారని వాటిని మహిళలు సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సంగ్ యాదవ్, సాగర్, ఆనంద్, రాఘవేంద్ర, పర్వత్ పాల్గొన్నారు.