Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేరపూరిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం బాలానగర్ డివిజన్ పరిధిలో మేడ్చల్ జిల్లా సంయుక్త కార్యదర్శి మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి, మేకల రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలు అంతర్జాతీయ తీవ్రవాదులకంటే ప్రమాదకరంగా ఉన్నాయని మండిపడ్డారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి ఉదాత్తమైన రాజ్యాంగాన్ని అందించారని, ఇదే రాజ్యాంగం చలవతో తెలంగాణ ఆవిర్భవించడమే కాకుండా కేసీఆర్కు సీఎం పదవి, వారి కుటుంబీకులకు పదవులు, సంపద చేకూరిందన్నారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆకుల నరేందర్, గజానంద్ శేఖర్ బాబు, ముక్తార్ అహ్మద్, తలారి భాను, వెంకటేష్ యాదవ్, కొండల్ రావు, కష్ణారావు పాల్గొన్నారు.