Authorization
Fri March 21, 2025 06:06:04 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
కూకట్పల్లిలోని మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరి షోను ఆదివారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీని నటి సిద్దికా శర్మ హాజరై మాట్లాడుతూ ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరి షోలో అభరణాలు ఆద్వితీయమైన కళా నైపుణ్యాతతో అంతులేని హుందాతనంతో కూడినవన్నారు. నగిషీ చెక్కిన ప్రతి అభరణం తయారు చేసిన వారి అనుభవం కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జోనల్ హెడ్ షానిబ్, స్టోర్ హెడ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ షో ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు నిర్వహిస్తామన్నారు. 22 క్యారెట్ల పాత బంగారం మార్పిడిపై 0 శాతం తగ్గింపు పొందాలన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ నిబద్దతలో భాగంగా వినియోగదారులకు 10 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుందన్నారు. అనంతరం ఆమె అభరణాలను పరిశీలించారు.