Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అర్బన్ సెంటర్ కాంట్రాక్టు ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలని, లేదంటే పెద్దఎత్తున ఉద్యమిస్తాం అని బహుజన విద్యార్థి సంఘం, ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు. అర్బన్ సెంటర్లో పని చేస్తున్న ఏ ఒక్కరిని తీసివేసిన ఊరుకునేది లేదని శనివారం రాత్రి ఓయూ వీసీని కలిసి చర్చిస్తే అది వాగ్వాదానికి దారి తీసింది. అర్బన్ సెంటర్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా డైరెక్టర్, వీసీ సతాయిస్తున్నారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల సంజరు, ఓయూ జేఏసీ చైర్మెన్ కొత్తపల్లి తిరుపతి, ఉపాధ్యక్షుడు పులిగంటి వేణుగోపాల్, అంబేద్కర్, సురేష్ పాల్గొన్నారు.