Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
సంక్షేమ సంఘాలు కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని మహేంద్రనగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం కాలనీలో మిగిలిన సీసీ రోడ్లు పూర్తి చేయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లను త్వరలోనే పూర్తి చేయిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఎన్నారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, పత్తి రాములు నాయుడు, ప్రధాన కార్యదర్శి నీలిమ, జాయింట్ సెక్రటరీ జనార్ధన్‌చారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రకాష్, కోశాధికారి వెంకట్, ఆడిటర్ ఎన్.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
శ్మశాన వాటిక ఏర్పాటుకు కృషి చేయండి
ఆర్థికంగా వెనుకబడిన కర్ణ భక్తులు మృతి చెందితే దహన సంస్కారాలకు ఇబ్బందులు పడుతున్నామని, తమ సంఘానికి నూతనంగా స్థలం కేటాయించి శ్మశాన వాటిక ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఆ సంఘం సభ్యులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పరుష శ్రీనివాస్‌యాదవ్, సంఘం అధ్యక్షులు సెల శంకర్, వైస్ ప్రెసిడెంట్ వీర కోటేశ్వరరావు, సతీష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ తమ్మ వెంకటేశ్వర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సమతం బీమేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.