Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్
నవతెలంగాణ-ఓయూ
ఎంతో మంది అనాథ పిల్లలను ఆదుకున్న రోజీ విల్సన్ సేవలు ప్రశంసనీయం అని దక్షిణ భారత పొలిటికల్ జేఏసీ చైర్మెన్, ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలో నవ భారత్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో రోజీ విల్సన్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనాథ పిల్లలకు అమ్మగా ఉంటూ ఎంతోమందిని చేరదీశారని కొనియాడారు. ఆమె పలువురికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. రోజీ విల్సన్ పేరుతో త్వరలో నగర శివారులో అనాథ ఆశ్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొందరు కబ్జాదారులు విల్సన్ బతికుండగానే ఆమె స్థలాన్ని ఆక్రమించుకునేందుకు నకిలీ డాక్యుమెంట్లను సష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రను తాము న్యాయపరంగా అడ్డుకోవడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగాపలువురికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది చంద్రకళ, రోజీ కుటుంబ సభ్యులు ఎడ్వీ జా.డేవిడ్, జో.సెల్వనా, బెబీనా, బెబక్క తదితరులు పాల్గొన్నారు.