Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ, అనుబంధ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్, అకాడమిక్ కన్సల్టెనీ, లైబ్రరీ సైన్స్‌లో ఇచ్చిన నోటిఫికేషన్లో గిరిజన విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. కొన్నేండ్లుగా గిరిజన విద్యార్థులకు బోధన రంగంలో, నాన్ టీచింగ్‌లో ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఎంతోమంది నెట్, సెట్ క్వాలిఫై ఉన్న విద్యార్థులను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. ఈసారైనా నోటిఫికేషన్లో గిరిజన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు సుబ్బు నాయక్, ఈశ్వర్ నాయక్, లింగాల విజరు నాయక్, శరత్ నాయక్, అశోక్ నాయక్, రమేష్ నాయక్, రవి నాయక్, వెంకట్ నాయక్ పాల్గొన్నారు.