Authorization
Fri March 21, 2025 04:44:17 pm
నవతెలంగాణ-అడిక్మెట్
వ్యాపారులు లాభసాటి బిజినెస్లు ఎంచుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ సబర్మతి నగర్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ్ ముదిరాజ్ నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు నాణ్యమైన విలువలతో వ్యాపారాలు నిర్వహించి తమ వ్యాపారాలను లాభసాటిగా ముందుకు నడుపుతూ ప్రజల మన్ననలు పొందాలని కోరారు. కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జైసింహ, సీనియర్ నాయకులు ముఠా నరేష్, డివిజన్ అధ్యక్షులు ఎం రాకేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పోతుల శ్రీకాంత్, మరిశెట్టి నర్సింగరావు, ముచ్చ కుర్తి ప్రభాకర్, హెచ్ హనుమంతు, ముఠా శివ సింహం, ఎం దేవయ్య, జి బాలకష్ణ, ఎండీ గౌస్, యాసీన్ అలీ, పి రాజ్ కుమార్ ,సంతోష్, మౌలాన, రత్నయ్య, చందు, తుడుం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.