Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ వద్ధాప్య పింఛన్ వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ద ఊరే బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో బీసీ నాయకులు సమావేశానికి హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీ 57 ఏండ్ల వారికి వద్ధాప్య పింఛను అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీని ఇంతవరకు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో వంద గజాల లోపు స్థలం ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టి ఇస్తానన్న హామీలు ఏమైందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు చేయలేదని తెలిపారు. బీసీ సబ్సిడీ రుణాల ఊసే లేదని ఆవేదన చెందారు. నిరుద్యోగ భతి వెంటనే అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రమేష్, శరత్, పవన్, రమణాచారి, కుమార్ యాదవ్, అశోక్ యాదవ్, ప్రవీణ్ రజక, సాయి యాదవ్, నవీన్, లింగరాజ్, వినరు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.