Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 33 వ డివిజన్‌లో గల ఖాళీ స్థలాలను కాపాడి వాటిని భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించవచ్చని కార్పొరేటర్లు ఏనుగు శ్రీనివాసరెడ్డి, కొలను తేజశ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం రాజీవ్ గహకల్పలోని ఖాళీ స్థలాలను కాపాడేందుకు చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి రూ. కోటి 15 లక్షలు మంజూరు చేయించి కాలనీ అభివద్ధి కొరకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాసరెడ్డి అభివద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ అభివద్ధి కోసం ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు.