Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
దుర్గానగర్‌లోని సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అన్నారు. సోమవారం అంబర్పేట్ డివిజన్లోనీ దుర్గా నగర్లో పర్యటించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్ధానికులు డ్రయినేజీ, వీధి దీపాలు ఐ మాక్స్ లైట్స్, విద్యుత్ తీగలపై ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు తొలగింపు వంచి సమస్యలను స్ధానికులు కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గానగర్‌లోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక బస్తీవాసులు దుర్గయ్య, తిరుమలయ్య, నరసింహగౌడ్, నరసింహ, టీఆర్ఎస్ నాయకులు వేణు, సంతోష్‌చారి పాల్గొన్నారు.