Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
దేశం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్ అని, ఆమె మరణం కళా సాహిత్య రంగంతో పాటు దేశానికి తీరని లోటని వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్క్ ప్రెసిడెంట్ ఎన్ పాండయ్య అన్నారు. సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనేక సినిమాల్లో గొప్ప సాహిత్యంతో కూడిన పాటలతో సామాజిక చైతన్యం తెచ్చారని కొనియాడారు. ఆమె గొంతు నుంచి వెలువడిన ప్రతి గానం అమతంలాగా ఉండేదని అన్నారు. ఆమె మరణం పట్ల పార్క్ కమిటీ ప్రగాఢ సంతాపం ఘటిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్క్ కోశాధికారి సలిపేల రమేష్ రెడ్డి, మాజీ ప్రెసిడెంట్లు నాగభూషణం, రాజేంద్రప్రసాద్, అంబటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ వాకర్స్ ఐలినేని కిషన్ రావు, మోహన్ రావు, ఎండీ రఫీ శంకర్ సంతోష్ రెడ్డి, సోమనాథం కె నర్సింహ, రాజేశ్వర్ రావు, అర్చనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కూకట్పల్లి
మూసాపేట్ డివిజన్ మోతీనగర్ చౌరస్తాలో మెలోడీ క్వీన్, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతి చెందిన ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ చిత్రపటం వద్ద మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీహెచ్ సత్యనారాయణ, సత్యం, సీతారామయ్య, తిరుపతి, రమేష్ అయ్యంగార్, శ్రీనివాస్ గుప్తా, మహమూద్, నాగరాజు, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.