Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. సోమవారం కొంపల్లిలో మున్సిపల్ చైర్మెన్ శ్రీశైలం యాదవ్‌తో కలిసి లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో రూ.243.83 లక్షలతో అభివద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ రాత్లవాత్ గంగయ్య నాయక్, మున్సిపల్ కమిషనర్ జి.రఘు, డీఈ.ఈ చిరంజీవులు, మేనేజర్ ఎస్.వెంకటేశం, ఏఈ ప్రవీణ్, వార్డు కౌన్సిలర్లు, రిటైర్డ్ మేనేజర్ జి.రమేశ్, వర్క్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.