Authorization
Fri March 21, 2025 01:19:29 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట కొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ శివ పంచాయతన సహిత మార్కండేయ స్వామి ఆలయంలో సోమవారం గూడ సత్యరాజు, గూడ సంతోష్ ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి వారికి 2.5 కేజీల వెండి నాగ పడగను సమర్పించారు. ఈ కార్యక్రమానికి జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్, సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్‌లు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షులు మునిపల్లి జనార్ధన్, నాయకులు రుద్ర దూలప్ప, ప్రభాకర్, సత్యనారాయణ, కొడిపాక రాజ్‌కుమార్, వెంకటయ్య, బొడ సాయి, యాదగిరి, బోడ రాజు, ఆశ్విని, శ్రీనివాస్, యాదగిరి, సంతోష్, మల్లేష్, ఆలయ అర్చకులు నోముల రమేష్ ఋషి తదితరులు పాల్గొన్నారు.