Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రంగారెడ్డి బండ, యాదిరెడ్డి బండలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కాలనీ వాసులు సోమవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా ప్రాంతాలలో సుమారు 200 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నామని, నూతనంగా స్థలం కేటాయించి శ్మశాన వాటిక ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు ఇందిరారెడ్డి, కొండయ్య, లక్ష్మయ్య, మౌలానా, ముంతాజ్, తుక్మమ్మ, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సౌకర్యం కల్పించాలి
గాజులరామారం డివిజన్ పరిధిలోని పీఎంరెడ్డికాలనీలో భూగర్భ డ్రయినేజీ, తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాజమౌలి, సభ్యులు సంజీవ్, కృష్ణమూర్తి, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.