Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
పద్మశాలీల అభివద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కషి చేస్తోందని
ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్సీ కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్‌పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీల్లో ఐక్యత ఎంతో అవసరమని చెప్పారు. అందరం ఐక్యంగా హక్కులను సాధించుకుందామని తెలిపారు. అంబర్‌పేట నియోజకవర్గంలో ఉన్న పద్మశాలీల అభివద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్‌రావు, అంబర్‌పేట నియోజకవర్గం అధ్యక్షుడు ఎనుగంటి నరేందర్, ఉపాధ్యక్షులు పుట్ట పాండురంగయ్య, ఎ.అంజయ్య, పగిడిమర్రి హరి, చిలుక శివ కుమార్, ఎస్.నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి వర్కాల కష్ణ, కార్యదర్శులు జి.సత్తయ్య, చిప్ప శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్, టి.నరేందర్, వివిధ డివిజన్ల అధ్యక్షులు కె.గట్టయ్య, కె.శ్రీనివాస్, పి.మధుసూధన్, కె.శ్రీకాంత్, కోట వెంకటేశ్, పి.దామోదర్, డీడీ అండ్ సీఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి, గంజి వెంకటరమణ, దూస సత్యనారాయణ, వనం రమణ, కాశి తదితరులు పాల్గొన్నారు.