Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా వ్యవహరించాలని మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ అద్యక్షుడు బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ అధికారులకు సూచించారు. మూడుచింతలపల్లి మండలంలోని కేశ్వపూర్ గ్రామంలో దళిత బంధు పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో స్థానిక సర్పంచ్ బుడిగే ఇస్తారి అక్రమాలకు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీ కార్యకర్తలను మాత్రమే ఎంపిక చేస్తున్నారని కేశ్వపూర్ గ్రామస్తులు మండల ఎంపీడీఓ పద్మావతికి, తహశీల్దార్ రాజేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేశ్వాపుర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాల్ నర్సింహ, దామోదర్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బి.కుమార్, బి.బుచ్చిరెడ్డి, ఎం.కిష్టయ్య, బి.మహేష్, ఎం.పాండు, డి.జహంగీర్, బి.ప్రేమలత, డి.రమేష్ పాల్గొన్నారు.