Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ-శ్రమ్ పోర్టల్ ఎంతో మంది అసంఘటిత రంగ కార్మికులకు, ప్రజలకు ఉచిత బీమా ద్వారా రెండు లక్షల వరకు ఆర్థిక భద్రత కల్పిస్తుందని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలోని విక్టోరియా కేఫ్, లేబర్ అడ్డ వద్ద ఈ శ్రమ్ కార్డు దరఖాస్తు శిబిరానికి డాక్టర్ లక్ష్మణ్ హాజరై కార్పొరేటర్ పావని వినరు కుమార్తో కలిసి అర్హులందరికీ కార్డులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అసంఘటిత కార్మికులందరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఉచిత బీమా సౌకర్యంతో ఆర్థిక భద్రత కల్పించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నగర యువ నాయకులు వినరు కుమార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ టీ.శిరీష, డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్, బీజేపీ నాయకులు గోపాల్, సలంద్రి శ్రీనివాస్ యాదవ్, యాదగిరి గౌడ్, తులసి, సత్తి రెడ్డీ, మహమూద్, సాయి కుమార్, హనుమంతు, సంతోష్,ఆనంద్ రావు,యాది పాల్గొన్నారు.